శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు


Mon,August 19, 2019 03:31 AM

అమ్రాబాద్ రూరల్ : ఆల్మట్టి డ్యాం నుంచి 20 రోజులుగా వరద ప్రభావం నిరంతరాయంగా కొనసాగుతుండడంతో జూరాలకు అంతే వేగంగా చేరుకున్న కృష్ణాజలాలు 16రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నాయి. జూరాల నుంచి శుక్రవారం వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం కావడంతో శుక్రవారం 34 అడుగుల నుంచి శనివారంకు 30 అడుగుల ఎత్తును తగ్గించి సాగర్‌వైపునకు అధికారులు వరద నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి నీటి ప్రవాహం శ్రీశైలం వైపు 5 లక్షలకు పైగా వరద వచ్చిచేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరదలతో తొలకని కుండలా ప్రాజెక్టు మారింది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద సంబంధిత అధికారులు పై నుంచి వస్తున్న వరద ఆధారంగా గేట్లను తగ్గిస్తు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు కృష్ణమ్మ పరవళ్లతో పయనిస్తుంది.

ఆదివారం 5 లక్షలకు పైగా నీటిని సాగర్‌వైపు శ్రీశైలం డ్యాం నుంచి వదులుతున్నారు. 10 గేట్ల ద్వారా 20 అడుగుల పైకి ఎత్తి 5,67,168 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 268.725 టీఎంసీల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం పొద్దుపోయె నాటికి 882.10 అడుగులు కాగా 199.2737 టీఎంసీల నీరు ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ప్రాజెక్టులు ఎనిమిది రోజలుగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ ఎడుమ పవర్‌హౌస్‌ద్వారా విద్యుదుత్పత్తి చేస్తు 42,100 క్యూసెక్కుల నీటిని ఎడమగట్టు ద్వారా, శ్రీశైలం కుడిగట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పవర్‌హౌస్ ద్వారా 27,622 క్యూసెకులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఎనిమిది రోజులుగా విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగతున్నదని, ఒక యూనిట్ ద్వారా 150 మెగావాట్స్ మొత్తం 2700 మెగావాట్స్ విద్యుతుత్పత్తి కొనసాగుతున్నదని ఇరిగేషన్ అధికారులు తెలపారు. అమ్రాబాద్ పరిధిలోని ఈగలపెంట తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

మన్ననూర్ వద్ద ట్రాఫిక్ జామ్
మండల పరిధిలోని మన్ననూర్ అటవీశాఖ చెక్‌పోస్టు
వద్ద అటవీశాఖ నిబంధనల మేరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను నిలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సెలవురోజు కావడంతో శనివారం రాష్ట్ర నలుమూల నుంచి శ్రీశైలం వెళ్లేందుకు బయలుదేరిన యాత్రికులు అటవీశాఖ చెక్‌పోస్టు వద్దకు రాత్రి 9 గంటలకు చేరుకున్న వాహనాలు మన్ననూర్ వద్దనే నిలుపుతున్నారు. ఈ క్రమంలో పెద్దమొత్తంలో చేరుకున్న వాహనాలు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న మన్ననూర్ అటవీశాఖ చెక్‌పోస్టు నుంచి మూలమలుపు వద్ద మూడు కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయింది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...