వనపర్తిలో వార్డు కమిటీల నియామకం


Mon,August 19, 2019 03:30 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : పట్టణంలోని పాత 26 వార్డుల ప్రకారంగా వార్డు కమిటీల కోసం వార్డుల వారిగా ఇన్‌చార్జిలను శనివారం నియమించారు. ఆదివారం ఆయా ఇన్‌చార్జిల, సబ్ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో వార్డుల వారిగా కమిటీలను ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు. వార్డు 1 నుంచి 5వ వార్డు వరకు లక్ష్మయ్య ఇన్‌చార్జి సబ్ ఇన్‌చార్జిలుగా లక్ష్మీనారాయణ, రహిం, కృష్ణయ్య, కేశవులు, గిరి, చుక్కరాజు, శ్రీనుసాగర్, వార్డు 6 నుంచి 10వ వార్డు ఇన్‌చార్జి పలుస రమేశ్‌గౌడ్, సబ్ ఇన్‌చార్జిలుగా గులాం ఖాదర్, ఏర్రశ్రీను, ఇందిరమ్మ, పరంజ్యోతి, ఎల్‌ఐసీ కృష్ణ, మురళీసాగర్, జయానంద్, వార్డు 11 నుంచి 15వ వార్డు వరకు వాకిటి శ్రీధర్ ఇన్‌చార్జి, సబ్ ఇన్‌చార్జిలుగా నాగమ్మ, బండారికృష్ణ, తిరుమల్, గౌస్, నందిమల్ల శ్యాం, చీర్ల సత్యం, గోకం శివ, గోవర్ధన్ చారి, విష్ణుసాగర్, వార్డు 16 నుంచి 20వ వార్డు వరకు ఇన్‌చార్జి గట్టుయాదవ్, సబ్ ఇన్‌చార్జిలు రమేశ్‌నాయక్, వెంకట్ సాగర్, షఫి, ఆవుల రమేశ్, గణేశ్, వెంకటేశ్‌యాదవ్, నక్కరాములు, కంచెరవి, వార్డు 21 నుంచి 26వ వార్డు వరకు ఇన్‌చార్జి లోకనాథ్‌రెడ్డి సబ్ ఇన్‌చార్జిలుగా రాములు యాదవ్, గోపాల్‌యాదవ్, సాయిబాబ, జహంగీర్, నాగన్నయాదవ్, పుట్టపాక మహేశ్‌ల ఆధ్వర్యంలో వార్డు కమిటీలను ఏర్పాటు చేయడంతో ఆయా వార్డుల ఇన్‌చార్జిలు, సబ్ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులను, ఇద్దరి ఉపాధ్యాక్షులను, ప్రధాన కార్యదర్శి, ఇద్దరి కార్యదర్శిలను, 9 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వనపర్తి మండలం కిష్టగిరి టీఆర్‌ఎస్ గ్రామ కమిటీని ఆదివారం ఎంపీటీసీ ధర్మనాయక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిన్నపాగ భగవంతు, ప్రధాన కార్యదర్శిగా తిమ్మన్న, ఉపాధ్యక్షులుగా శేషయ్య, శేఖర్ కార్యవర్గ సభ్యులుగా సురేశ్, శివకుమార్, రాములు, శంకర్, చెన్నయ్య, శాంతమ్మ, బాలకృష్ణ, బొజ్జన్న, నరేందర్, ఆంజనేయులు భాగలక్ష్మి, చంద్రయ్య, కురుమయ్య, వెంకటేశ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నకొబడిన సభ్యులను ఎంపీపీ కిచ్చారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచు వెంకటయ్య, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...