రాష్ట్ర స్థాయిలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ


Mon,August 19, 2019 03:30 AM

- అథ్లెటిక్స్ పోటీలలో పది మెడల్స్ కైవసం చేసుకున్న క్రీడాకారులు
వనపర్తి క్రీడలు : హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రెండో రోజు జరుగుతున్న 6వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలలో వనపర్తి జిల్లా క్రీడాకారులు పది మెడల్స్ సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, నరసింహలు తెలిపారు. ఆదివారం ఈ పోటీలలో మొదటి, రెండో రోజులలో భాగంగా 2 గోల్డ్, 6 సిల్వర్, 2 బ్రాంజీ మెడల్స్‌ను క్రీడాకారులు సాధించినట్లు వారు తెలిపారు. ఈ మెడల్స్ సాధించిన వారిలో అండర్-18లో 2వేల మీటర్ల పరుగు పందెంలో టీ విష్ణుకు గోల్డ్ మెడల్, అండర్-20 విభాగంలో 5వేల మీటర్ల పరుగు పందెంలో జే సంతోష్‌కుమార్‌కి సిల్వర్ మెడల్, అండర్-16 విభాగంలో 2,800 మీటర్ల పరుగు పందెంలో కృష్ణ సిల్వర్, అండర్- 20 విభాగంలో 800 మీటర్లలో వీ వినోద్ సిల్వర్ మెడల్స్‌ను సాధించినట్లు వారు తెలిపారు. ఈ క్రీడాకారులను వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ అసొసియేషన్ కార్యనిర్వహక కార్యదర్శి శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, టీం మేనేజర్ రాజేశ్, భరద్వాజ్‌లు క్రీడాకారులను అభినందించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...