పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Sun,August 18, 2019 02:14 AM

ఇటిక్యాల : 44వ జాతీయ రహదారి ఎర్రవల్లి చౌర స్తాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఇటిక్యాల ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు... జోగుళాంబ గద్వాల జిల్లా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్న హన్మంత్ పెబ్బేర్ నుంచి గద్వాలకు మొటార్ బైక్‌పై వెళ్తున్నాడు. ఎర్రవల్లి చౌరస్తాలో గద్వాల రోడ్డు వైపు మలుపు తిప్పుతుండగా కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో హన్మంత్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూల్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హన్మంత్ మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడి అన్న కొడుకు వీరేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కల్యాణ్‌సింగ్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...