గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ను నింపుతాం


Sun,August 18, 2019 02:14 AM

పెబ్బేరు : గోపల్‌ది న్నె రిజర్వాయర్‌ను త్వరితగతిన నింపుతామని, అందుకోసం జూరాల వెంట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు తా త్కాలికంగా సాగునీటిని నిలిపివేస్తున్నట్లు జూరాల జేఈ రాంప్రసాద్‌రావు, వనపర్తి ఆ ర్డీవో చంద్రారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ప్రియదర్శిని జూరాల అతిథి గృహంలో గోపల్‌దిన్నె, డిస్ట్రిబ్యూటర్ల రైతులతో అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జూరాల వెంట ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు సాగునీటిని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ నిండిన వెంటనే యథావిధిగా నీటిని వదులుతామన్నారు. దీంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వివాదం నెలకొంది. జూరాల నుం చి సాగునీరు విడుదలైనప్పుడే డిస్ట్రిబ్యూటర్లను నిలిపివేసి రిజర్వాయర్‌ను నింపాల్సింది పోయి, వరి తుకాలు పోసుకుని కరిగెట్లు చేసుకుంటున్న సమయంలో ఇప్పుడు నీటిని నిలిపేస్తే ఎలాగని ప్రశ్నించారు. రెండు రోజులు డిస్ట్రిబ్యూటర్లకు, రెండు రోజులు రిజర్వాయర్‌కు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పెబ్బేరు, వీపనగండ్ల రైతులతో అధికారులు చర్చించి రెండు రోజులపాటు రిజర్వాయర్‌కు నీటిని మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జూరాల డీఈ హారిక, ఈఈ శ్రీధర్, పెబ్బేరు, శ్రీరంగాపూర్ తాసిల్దార్లు సునిత, శాంతీలాల్, పెబ్బేరు, గోపల్‌దిన్నె ఆయకట్టు రైతులు ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...