మొక్కే కదా అని నిర్లక్ష్యం చేస్తే చర్యలు


Sun,August 18, 2019 02:08 AM

చిన్నంబావి : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని, మొక్కే కదా అని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్వేతామొహంతి అధికారులను ఆదేశించారు. మండలంలోని వెల్గొండ, కొప్పునూరు, అయ్యవారిపల్లి గ్రామాల్లో నాటిన మొక్కలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారంతో కాకుండా బాధ్యతతో మొక్కలను పెంచి రక్షించాలన్నారు. ప్రతి ఒ క్కరూ మొక్కలు నాటాలన్నారు. సర్పంచ్ మొదలుకొని ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ మొక్కలను పరిశీలించి ప్రధాన రహదారుల వెంట ఉ న్న మొక్కల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్క ఎండిపోకుండా చూసుకోవాలని, ఎండిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు.

ప్రతి ఒక్కరూ ఇంటి ముందు కూడా మొక్కలను తప్పనిసరిగ్గా నాటాలని సూచించారు. అ నంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. కార్యక్రమం లో తాసిల్దార్ ఫర్కుందాతన్సిమ్, ఎంపీడీవోలు ఆంజనేయులు, బద్రినాథ్, ఆర్‌ఐ మూర్తి, పంచాయతీ కార్యదర్శి రమేశ్, ఏపీవో అప్సరున్నిసా భేగం, టీఏ గోపాల్, సర్పంచ్‌లు రామస్వామి, కౌసల్య, శివమ్మ ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...