తల్లిపై కొడుకు దాడి - కేసు నమోదు


Sun,August 18, 2019 02:08 AM

రాజోళి : తల్లిపై కొడుకు దాడి చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీంతో అతనిపై కేసు నమోదయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ వేమన తెలిపిన వివరాల మేరకు.. నసనూర్ గ్రామానికి చెందిన బోయ శంకరమ్మ కుమా రుడు బాలకృష్ణ జల్సాలకు అలవాటు పడ్డాడు. తన భార్య కూడా అనారోగ్య కారణాల రిత్యా పుట్టినింటికి వెళ్లింది. దీంతో మరింత జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి తన భూమిని అమ్ముకోవడమే కాక, తల్లికి చెందిన భూమిని కూడా కావాలని వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తల్లిపై కర్ర తీసుకొని దాడి చేయగా, ఎడమ చేయి విరిగిపోయింది. శనివారం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వేమన తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...