కష్టం దళారులపాలు కావొద్దు


Sat,August 17, 2019 04:13 AM

-మత్స్యకారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన
-కలెక్టరుతో కలిసి రంగసముద్రంలో చేప పిల్లల విడుదల
-జిల్లాలో 252 కోట్ల చేపలను వదలనున్నట్లు వెల్లడి

పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : ఇప్పుడు వదులున్న ఒక్కో చేపపిల్ల అది పెద్దదయ్యాక ముప్పై రెట్లు విలువ చేస్తుంది.. చేతికొచ్చిన చేపలను అమ్ముకోవడంలో దళారులను ఆశ్రయించొద్దు.. మీ కష్టం దళారులపాలు కా కుండా మీరే ఆ ఫలాలను అనుభవించండి అని మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శ్రీరంగాపురం మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో లక్షా యాభై వేల చేపపిల్లలను కలెక్ట ర్ శ్వేతామొహంతితో కలిసి మంత్రి వదిలారు. ఈ సం దర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తి సబ్సిడీతో కూడిన చేపపిల్లలను చెరువులు, కుంటలలో వదలడం వల్ల మత్స్యసంపద పెరిగి, మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యేడాది జిల్లాలోని నీటి వనరు ల్లో మొత్తం 252కోట్ల చేపపిల్లలను వదలనున్నట్లు ఆయన వెల్లడించారు.

చేపలు పట్టి మార్కెట్‌కు తెచ్చే దాకా మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. రంగసముద్రం రాయల్టీ తగ్గింపు విషయమై గతంలో మత్స్యకారులు వేసిన కోర్టు కేసు ను ఉపసంహరించుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయమై మంత్రి అక్కడే ఉన్న కలెక్టరుతో చర్చించడమే గాకుండా, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథరెడ్డి, వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, మత్స్యశాఖ అధికారులు హనుమంతరావు, రాధారోహిణి, సర్పంచ్ వినీలారాణి, సింగిల్ విండో అధ్యక్షుడు ఆనందరాజు, కోదండరామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గౌనిబుచ్చారెడ్డి, టీఆర్‌ఎస్ ఉమ్మడి మండలాధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు, నాయకులు పృధ్వీరాజు, జలీల్, వాహెద్, వెంకటస్వామి, మత్స్య సంఘం నాయకులు కృష్ణయ్య, రఘు, బుచ్చన్న, ఎల్లస్వామి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

శ్రీరంగాపురానికి సీఎం కేసీఆర్‌ను తీసుకొస్తా..
త్వరలో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు సాగే సీఎం కేసీఆర్ పర్యటనలో ఆయనను శ్రీరంగాపురం మండల కేంద్రానికి తీసుకొస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో సీఎం టూర్ షెడ్యూలును ఖరారు చేసే సమయంలో తప్పకుండా శ్రీరంగాపురం పర్యటన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్వేతామొహంతిని ఆయన ఆదేశించారు. శుక్రవారం శ్రీరంగాపురం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చేపపిల్లలను వదిలిన అనంతరం గ్రామస్తులు రంగసముద్రం నుంచి సాగునీరు రాని విషయం ఆయన దృష్టికి తెచ్చారు. ఒక పక్క నదులు ఉప్పొంగి నీళ్లు వరదలై పారుతుంటే భీమా ప్రాజెక్టు నుంచి నీరు కాలువ ద్వారా తక్కువ ప్రవాహంతో పారుతుండడం వల్ల రంగసముద్రం నిండలేకపోతుందని, దీంతో పంటల సాగు ప్రశ్నార్థకమైందని వారు మంత్రితో చెప్పారు.

ఇందుకు మంత్రి స్పందిస్తూ గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఇప్పటికీ రిజర్వాయర్లు నిండలేక పొతున్నాయని అన్నారు. అప్పటి డిజైనింగ్ లోపం వల్లే ఇప్పుడు సమస్య ఏర్పాడుతున్నాయని అన్నారు. పాత కాలువలను మళ్లీ పెద్దగా నిర్మించి, నీళ్లు సాఫీగా సాగేట్లు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనలో ఈ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చి నిధులు మంజూరి చేయించేందుకు కృషి చేస్తానని నిరంజన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...