స్పోర్ట్స్ స్కూల్‌కి జిల్లా విద్యార్థులు ఎంపిక


Sat,August 17, 2019 04:09 AM

వనపర్తి క్రీడలు : జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా మైదానంలో ఇటీవల స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని స్పోర్ట్స్ స్కూల్‌కి వనపర్తి జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి అనీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో మొత్తం మూడు క్రీడాలకు సంబంధించిన పాఠశాలలను ఆదిలాబాద్, హకీంపేట్, కరీంనగర్ జిల్లాలో మాత్రమే ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అందులో భాగంగా జిల్లా నుంచి స్పోర్ట్స్ స్కూల్‌కి ఎంపికైన విద్యార్థులు హైదరాబాద్‌లోని హకీంపేట క్రీడల పాఠశాలకు పెద్దమందడి మండలానికి చెందిన సాయిపృధ్వీ, ఘనపురం మండలానికి చెందిన మహేశ్, సిద్దార్థ పాఠశాలకు చెందిన రమ్య, కొత్తకోట మండలానికి చెందిన సాయిలక్ష్మిబాలాజీ, అలాగే ఆదిలాబాద్ క్రీడల పాఠశాలకు పెద్దమందడి మండలానికి చెందిన శ్రీనిధి, ఘణపురం మండలానికి చెందిన కె.రమ్య, అమరచింత మండలానికి చెందిన రాంచరణ్ ఎంపిక కాగా, కరీంనగర్ క్రీడల పాఠశాలకు వనపర్తికి చెందిన ఎన్.ప్రవళిక ఎంపికైయ్యారు. జూన్ 18న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరచడంతో వీరు స్పోర్ట్స్ పాఠశాలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ పాఠశాలకు ఎంపికైన వీరిని సిబ్బంది, అభినందించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...