ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి


Sat,August 17, 2019 04:09 AM

వనపర్తి రూరల్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలను రైతులకు అందిస్తు, ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లాలోని వ్యవసాయాధికారులకు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సుజాత ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల వ్యవసాయ అధికారుల, విస్తరణ అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను రైతులకు అందేలా చూడాలని, వాటిని వందశాతం పూర్తి చేయాలని, అలాగే ఎప్పటికప్పుడు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న కిసాన్ సమ్మయోజన్, రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న రైతుబంధు, బీమా, పర్టిలైజర్, రైతు సమాచారాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. 2019 వానాకాలం సమాచారం ఈనెల 20వ తేదీలోపు సేకరించాలని, అలాగే జిల్లాలోని వ్యవసాయశాఖ కేటాయించిన హరితహార లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయశాఖ సంచాలకుడు శివనాగిరెడ్డి, సాంకేతిక సహయకులు పూర్ణచందర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...