శ్రీశైలం నుంచి 10 గేట్ల ద్వారా నీటి విడుదల


Sat,August 17, 2019 04:07 AM

అమ్రాబాద్ రూరల్ : ఎగువ నుంచి పదిహేడు రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు వడివడిగా శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుతోంది. జూరాల నుంచి 53 గేట్ల్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి జూరాల నుంచి వరద తగ్గడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను 37 నుంచి 34 అడుగులకు తగ్గించి నీటిని వదులుతున్నారు. 10 గేట్ల ద్వారా 7,02,410 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి స్ఫిల్ వే ద్వారా 7,54,339 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి 881.50 అడుగులు, 196.1108 టీఎంసీల నీరు ఉన్నది.

మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలకు 1600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 44,000 క్యూసెక్కులు, హంద్రీనివా ప్రాజెక్టుకు 2025 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడుమ విద్యుత్ ప్రాజెక్టులు ఏడు రోజలుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు టీఎస్ ఎడుమగట్టుకు 38,140 క్యూసెక్కులు, కుడిగట్టుకు 29,714 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తొమ్మిది రోజులుగా ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగతున్నదని, ఒక యూనిట్ ద్వారా 150 మెగావాట్స్ మొత్తం 2700 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. నల్లమల ప్రకృతి అందాలను తిలికించేందుకు శనివారం వచ్చిన సందర్శకుల తాకిడితో శ్రీశైలం-హైదరబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మరింతగా పెరిగింది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...