జన ఘన మన


Fri,August 16, 2019 02:08 AM

-జాతీయ జెండా ఆవిష్కరణ
-పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి , కలెక్టర్, ఎస్పీ
వనపర్తి, నమస్తే తెలంగాణ/వనపర్తి విద్యావిభాగం : 73వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాతీయ జెండా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వినియోగదారు వ్యవహారాల శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి, జిల్లా ఎస్పీ అపూర్వరావులు సాదారంగా వేదికపైకి ఆహ్వానించారు. పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అలాగే జాతీయజెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్, ఎస్పీలతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి శాలువా, పూలమాలలతో సన్మానించారు. జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సందేశాన్ని మంత్రి క్లుప్తంగా చదివి ప్రజలకు వివరించారు. జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు మైదానానికి విచ్చేసిన చూపురులను కట్టిపడేశాయి. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు, వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో టై సైకిళ్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, మత్య్సశాఖ ఆధ్వర్యంలో వాహనాలను లబ్ధిదారులకు మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలిసి అందజేశారు.

పలు శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాట్లు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 12 శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌లను ఆయా శాఖల జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడంతో వాటి గురించి మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి, జిల్లా ఎస్పీ అపూర్వరావులతో పాటు అధికారులు వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, పెద్ద కుంటలు, చిన్నకుంటలు, జిల్లా విద్యాశాఖ కేజీబీవీ పాఠశాలల నుంచి అల్లికలు, ఎంబ్రాయిడింగ్, ఉలన్‌వర్క్ , మగ్గంవర్క్స్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం, జీవ ఎరువులు, రైతుబంధు పథకం, అటవీ శాఖ ఆధ్వర్యంలో తులసి, దానిమ్మ, జామ, కానుగ వంటి 600 మొక్కల పంపిణీ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో- బేటీ పడావో, కేసీఆర్ కిట్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు, స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకు రుణా లు, ఆస్తుల ప్రదర్శనలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, షీటీం, చట్టాలపై అవగాహన, సాగర్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పర్యావరణానికి సంబంధించిన ఆటోలు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మట్టి పాత్రలు, బీసీ హాస్టల్ , రెసిడెన్షియల్ విద్యార్థులతో ఆర్ట్స్‌కు సంబంధించి, మహిళలకు అండగా సఖి కేంద్రం 181, ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో నీటి నాణ్యత, పరిశుభ్రత, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గడ్డి కత్తెర, పశువుల సంరక్షణ, అత్యవసర సేవలు 1962 వంటి స్టాల్స్‌ను ఆయా శాఖల జిల్లా అధికారులు ఏర్పాటు చేయడంతో ప్రజలు స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించి వివరాలను, ఉపయోగాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రెపరెలాడిన మువ్వన్నెల జెండా
వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాల యాలు, ప్రజా సంఘాలు, ఆటో యూనియన్, పలు పార్టీల ఆధ్వర్యంలో గురువారం 73వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బీ కృష్ణయ్య, డీఈవో కార్యాలయంలో విద్యాధికారి సుశీందర్‌రావు, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు జెండా ఆవిష్కరణ గావించారు. అదేవిధంగా ప్రతి పాఠశాల, కళాశాలల్లో జాతీయ పతాకావిష్కరణ గావించి వేడుకలు నిర్వహించారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...