మహిళ సంఘాల ఆధ్వర్యంలో...


Fri,August 16, 2019 02:02 AM

పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని డీఈవో సుశీందర్‌రావు చెప్పారు. ఈ ప్రదర్శనలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావులు తిలకించి వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీరంగాపురానికి 8 వేల నగదు, కేతేపల్లి ఉన్నత పాఠశాలకు ద్వితీయ బహుమతి రూ.5 వేలు, టీఎస్‌డబ్ల్యూఆర్ మదనాపురానికి రూ.3 వేలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మదర్స్ ల్యాబ్ పాఠశాలకు చెందిన విద్యార్థి సాహినిక్షిత, సుశింత, వైష్టవి, ఆత్రిలు ఇచ్చిన ప్రదర్శనకు ప్రథమ బహుమతిని డీఈవో సుశీందర్‌రావు చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో గణేశ్, అసిస్టెంట్ డీఆర్‌డీవో వెంకన్న, జిల్లా సెక్టోరియల్ అధికారులు గణేశ్, చంద్రశేఖర్, డీఎస్‌వో శ్రీనివాసులు, నోడల్ అధికారిని వరలక్ష్మి, జిల్లా క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...