పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య


Fri,August 16, 2019 02:01 AM

ఊట్కూర్ : పురుగుల మందు తాగి వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. తమ కూతురు మృతికి వరకట్న వేధింపులే కారణమంటూ మృతిరాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఎస్సై ఎంఏ రషీద్, స్థానికులు అందించిన వివరాల మేరకు... మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన కోట్ల కుర్మయ్యతో మక్తల్ మండలంలోని భగవాన్‌పల్లికి చెందిన శోభ(20)ను ఏడేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. కొన్నేళ్లు కాపురం సజావుగానే సాగింది.

దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా కొద్ది నెలల నుంచి భర్త కుర్మయ్య, అత్త, మామలు అదనపు వరకట్నం తేవాలని శోభపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మనస్థాపం చెందిన శోభ గురువారం తెల్లవారు జామున ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానాలో చేర్పించగా చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. కూతురు మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. కూతురు పెళ్లి సమయంలో కట్నం కింద రూ.20 వేలు, మూడు తులాల బంగారు ఆభరణాలు చెల్లించామని చెప్పారు. అయినప్పటికీ అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, మామలు శాంతమ్మ, కతలప్ప, మరిది రవి, ఆడపడుచు చెన్నమ్మ తమ కూతురును వేధించారన్నారు. వేధింపులు తాళ లేకనే ఆత్మహత్యకు పూనుకుందని తల్లి మాణిక్యమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, శవానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని ఎస్సై విలేకరులకు తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...