భవనం పైనుంచి దూకి ఆత్మహత్య


Fri,August 16, 2019 02:01 AM

అయిజ రూరల్ : రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి ఆత్మహత్యకు దారి తీసింది. ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అయిజ మండలం నౌరోజీక్యాంపు గ్రామానికి చెందిన మోహన్ (24) హైదరాబాదులోని కూకట్‌పల్లి ప్రాంతంలో హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సొంత పనుల నిమిత్తం కారులో మూసాపేటకు వెళుతున్న క్రమంలో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే అక్కడి నుంచి తాను ఉంటున్న ప్రదేశానికి మోహన్ చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్ నివాసం ఉండే ప్రాంతానికి వచ్చి అతడి వివరాలు అడిగే ప్రయత్నంలో మోహన్‌కు సమాచారం అందింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు తాను నివసిస్తున్న నాలుగవ అంతస్తు భవనంపై నుంచి దూకి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాదుకు వెళ్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో నౌరోజీక్యాంపు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...