గంగిరెద్దుకు అంత్యక్రియలు


Fri,August 16, 2019 02:00 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ : ఒక వైపు నారాయణపేట ఎస్పీ కార్యాలయం వద్ద పంద్రాగస్టు సంబురాలు జరుగుతుండగా అదే మార్గంలో ఓ గోవు మృతి చెందడంతో వెంటనే స్పందించిన మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ట్రాక్టర్‌లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గంగిరెద్దులకు చెందిన ఓ కుటుంబం ఎద్దు ద్వారా ప్రదర్శనలు ఇస్తూ స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇంతలోనే ఎద్దు తీవ్ర అస్వస్థతకు గురై ఎస్పీ కార్యాలయం మార్గంలో మృతి చెందింది.

దీంతో వాటి యజమానులైన గంగిరెద్దుల కుటుంబం తమకు ఏకైక జీవనాధారమైన గంగిరెద్దు మృతి చెందడంతో తమ పరిస్థితి రోడ్డున పడిందన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రోధించారు. వారు పడుతున్న రోధనను చూసి జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ చెన్నకేశవులు మున్సిపల్ ట్రాక్టర్‌ను అక్కడికి రప్పించి, సిబ్బంది సహాయంతో అంత్యక్రియలకు తరలించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...