భారీ జాతీయ జెండా ప్రదర్శన


Fri,August 16, 2019 01:59 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: పట్టణంలోని విశ్వభారతి ఉన్నత పాఠశాల విద్యా ర్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పా ఠశాలలో విద్యార్థులు భారీ జాతీయజెండాను ప్రదర్శించారు. 600 అడు గుల పొడవు భారీ త్రివర్ణ పథాకాన్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు నినదిస్తూ జెండా ప్రదర్శనను నిర్వ హించారు. అదేవిధంగా పెబ్బేరు పరిరక్షణ సమితివారి సహకారంతో భారీగా చేపట్టిన 120మీటర్ల జాతీయ జెండాను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టణంలోని పు రవీధులలో భారీగా ర్యాలీతో ప్రదర్శించారు. జాతీయభావం, దేశభక్తి పెపొందించే విధంగా చేసిన ప్రదర్శనను పలువురు తిలకించి అభినందించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...