రాష్ట్రస్థాయి పోటీలకు 25 మంది క్రీడాకారుల ఎంపిక


Thu,August 15, 2019 03:09 AM

వనపర్తి క్రీడలు : ఈనెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే 6వ తెలంగాణ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు క్రీడాకారులు సిద్ధంగా ఉండాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు బోలమోని లక్ష్మయ్య, నర్సింహ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ -14, 16, 18, 20 బాల,బాలికల విభాగంలో వివిధ అంశాల్లో పోటీపడి విజేతలుగా అథ్లెటిక్స్ జిల్లాస్థాయిలో ఎంపికయ్యారు. 16వ తేదీ ఉదయం 6గంటల వనపర్తి రోడ్డు రైల్వేస్టేషనుకు ఎంపికైన క్రీడాకారులు చేరుకోవాలన్నారు. ఇతర వివరాలకు శ్రీకాంత్ 8096115222 కు ఫోన్‌చేయాలన్నారు.

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
జూలై 31న స్థానిక బాలకిష్ట్రయ్య క్రీడామైదానంలో జిల్లా క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. మొత్తం 25 మంది జిల్లాస్థాయికి ఎంపిక కాగా బాలికల విభాగంలో శ్వేతా, మంజుల, లావణ్య, సుజాత, శిరిష, బాలుర విభాగంలో వినోద్‌కుమార్, ఎండీ షబీర్, సంజీవ, సునిల్, నవీన్, విష్ణువర్ధన్, నవీన్, శివగణేశ్, క్రిష్ణ, విష్ణు, నరేశ్, గణేశ్, ప్రవీణ్, రాజునాయక్, శ్రీకాంత్, నవీన్, రఘవేంద్ర, సంతోశ్, వినోద్‌నాయక్, ప్రకాశ్‌లను ఎంపిక చేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...