రెండు మోటర్ల ద్వారా సాగునీటిని విడుదల చేయండి


Thu,August 15, 2019 03:08 AM

పెబ్బేరు రూరల్ : మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. బుధవారం మండలంలోని రాంపురం, శాఖాపూర్, రామమ్మపేట గ్రామాలకు వెళ్లే రోడ్లపై నాటిన మొక్కలను, రామమ్మపేటలోని నర్సరీని ఆమె పరిశీలించారు. నర్సరీలో మొక్కల సైజు చిన్నగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు నాటే అదును దాటిపోతుందని, నర్సరీ నిర్వాహకులు మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొక్కల పెంపకం, నాటడంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఆమె వెంట డీఆర్‌డీవో గణేశ్, తాసిల్దార్ సునిత, ఎంపీడీవో ఆంజనేయులు తదితరులున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...