ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం


Thu,August 15, 2019 03:08 AM

పెద్దమందడి : పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి భవితరాలకు బాటలు వేయాలని జెడ్పీ సీఈవో నరసింహులు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు వీరాయిపల్లి గ్రామంలో ఎంపీడీవో నాగశేషాద్రి సూరితో కలిసి ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ ఒక పెనుభూతమని, దాన్ని తరిమేసే బాధ్యత మానవులపై ఉందని గుర్తు చేశారు. పర్యావరణంలో మార్పులు వస్తే మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ భానుప్రసాద్, ఏపీఎం రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి, పీల్డ్ అసిస్టెంట్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...