అష్టావధానానికి అందరూ ఆహ్వానితులే


Wed,August 14, 2019 02:29 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : అష్టావధానం కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులని జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వీ మనోహర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ సాహి త్య పరిషత్ పాలమూరు ఆహ్వానం అవధాన కళానిధి బిరుదాంకితులైన బ్రహశ్రీ ఆముదాల మురళి చేత అష్టావధానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14న సాయంత్రం 5:30 గంటలకు జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల, న్యూటౌన్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాహిత్యానికి మంచి రోజులున్నాయని తెలిపారు. కవులు, కళాకారులు అష్టావధానం కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి హాజరు అవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...