స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోండి


Wed,August 14, 2019 02:29 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : మార్కెట్ యార్డు ప రిధిలో పనిచేస్తున్న కార్మికులతోపాటు అందరూ టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వచ్ఛందగా తీసుకోవాలని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కాడం ఆంజనేయులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన స మావేశంలో మార్కెట్‌యార్డులోని పలువురు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడిన అనంతరం టీఆర్‌ఎస్ సభ్యత్వ న మోదు కార్యక్రమం నిర్వహించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా స్వచ్ఛందంగా అభివృద్ధికి అండగా ఉండేందుకు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాల న్నారు. మార్కెట్‌లను అన్ని విధాలుగా తెలంగాణ ప్రభు త్వం ఆదుకుంటుందన్నారు. మార్కెట్ యార్డులు పారదర్శకంగా ముందుకు తీసుకుపోయేందుకు నూతన విధానాలకు స్వాగతం పలుకుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వంతో ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో పలువురితో టీఆర్‌ఎస్ సభ్యత్వ న మోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య, మాజీ అధ్యక్షులు చంద్రమౌళి, మార్కెట్ డైరెక్టర్లు శరత్‌బాబు, అనురాధ, ఓంప్రకాశ్, కుమారస్వామి ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...