పట్టుదలతో ముందుకు సాగండి


Wed,August 14, 2019 02:28 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : మీకు చెప్పిన.. చేస్తున్న ప్రతి పని లక్ష్యంతో ఖచ్చితంగా చేయాలనుకుంటే మీరు చేసి తీరుతారు అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో మూసాపేట, అడ్డాకల్ మండల ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్‌లతో స మీక్షా సమావేశం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడారు. హరితహారంలో భాగంగా మీకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, గుంతలు తీసి మొక్కలను నాటడమే కాకుండా, జంతువులు తినకుండా వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో డం పింగ్ యార్డుల ఏర్పాటుకు శ్మశాన వాటికల నిర్వహణకు, బర్నింగ్, స్టేజ్‌ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి వాటికి మార్క్ చేసి, గ్రామ పంచాయతీలలో రిజిస్టర్ చేయాలని పేర్కొన్నారు. గ్రామాలలో ఇంకుడు గుంత లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు త్వరగా పూర్తి చేసే లా చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని, కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వారు సొంతంగా నిర్మించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండేలా చూ డాలని, లేని వాటి నివేదికను తయారుచేసి గ్రౌండింగ్ చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం ఎంతవరకు పూర్తి అయినవి, ఇంకా పూర్తి చేయని వాటిని వెంటనే నిర్మాణం చేపట్టాలని సూచించారు. నిర్మాణం చేయని వారికి ఫైన్ వేయాలని తెలిపారు. నోటీసులు జారీ చేయాలని, పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. కంపోస్టు కిట్స్ ఎంత వరకు చేశారు, చేయకపోతే వెంటనే చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వల్లూరి క్రాంతి, డీపీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, వీఆర్‌వోలు, పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...