నేరాలు కట్టడి చేసేందుకు చర్యలు


Wed,August 14, 2019 02:27 AM

-సమావేశంలో ఎస్పీ రెమారాజేశ్వరి
మహబూబ్‌నగర్ క్రైం: నేరాల విస్తృతి పెరిగిన నేపథ్యం లో పోలీసు పరిశోధనలో పదును పెంచుకోవడం ఆవశ్యమని, అల్లరి మూక అరాచకాలను కట్టడి చేసేందుకు వృత్తిపరమైన నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో నెలవారి నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మహిళలు, అమ్మాయిలపై జరిగే వికృత చర్యలు, సామాజిక మాద్యమాలలో వదంతుల ద్వారా సమాజంలో గొ డవలు సృష్టించే ప్రచారాలు, ఇలా కొత్తనేరాలు మన వృత్తినైపుణ్యానికి సవాలు విసురుతున్నాయన్నారు. పోలీసు వృత్తిలో ఇక అయిపోయిందని ఊపిరి పీల్చుకోవడం ఉండదని, మరో సవాల్ మన ఎదురుగా నిలు స్తుందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమాలు మన పోలీసుకు చక్కటి సమాచారం అందిస్తున్నాయన్నారు. మూస పద్ధతి పరిశోధన నేరనివారణ చర్యలకు కాలం చెల్లింద న్నారు. కొన్ని కేసులు మన పోలీసు పరిశోధనా పుస్తకాలకు అందని రీతిలో చికాకు కలిగిస్తాయన్నారు. మనకున్న అనుభవాలకు సానపడితే ఆధునిక పరిజ్ఞానపు పోకడలను వినియోగించుకోవాలన్నారు. అనుభవజ్ఞులైన అధికారుల సూచనలు, సలహాలతో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల న్నారు. పోలీసు అధికారుల నిఘా మరిం త పెరగాల్సి ఉందన్నారు. ఇటీవల కాలం లో నేరపరిశోధన, నేరగాళ్లకు శిక్ష ఖరారు, బాలకార్మికుల నిరోధన షీ బృందాలు పోలీసు స్టేషన్లలో వివిధ సందర్భాలలో నైపుణ్యాలను ప్రదర్శించిన అధికారులు సిబ్బంది 25 మందికి ఎస్పీ నగదు రివార్డులు అం దజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు బీ భాస్కర్, శ్రీనివాస్, జిల్లాలోని ఇన్ స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

పోలీసులను గౌరవంగా చూసుకోవాలి
పోలీసు వృత్తిలో సుదీర్ఘకాలంగా పనిచేసి అమూల్యమైన సేవలందించి ఉద్యోగవిరమణ సొందిన సిబ్బంది పట్ల అధికారులు, సహచరులు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉం టారని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. జూలై మాసాంతానికి పదవీ విరమణ పొందిన ఏఆర్‌ఎస్సై మల్లయ్య, హెచ్‌సీ సుదర్శన్‌లను ఘనంగా ఎస్పీ సత్కరించారు. పోలీసుశాఖకు సంబంధించిన సిబ్బంది జిల్లాలో పదవీ విరమణ తర్వాత కూడా పలు సేవా కార్యక్రమాలను ని ర్వహిస్తూ ఉత్సాహంగా ఉండడం సంతోషంగా ఉందన్నా రు. సిబ్బంది సంక్షేమం పట్ల పోలీసు అధికారులు చిత్తశుద్ధితో ఉంటారన్నారు. అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, పీఆర్వో రంగినేని ఆభినందనలు తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...