పాము కాటుకు విద్యార్థి మృతి


Tue,August 13, 2019 01:41 AM

మల్దకల్ : పాము కాటుకు గురై విద్యార్థి మృతి చెందిన సంఘటన మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి వివరాల ప్రకారం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు నాగరాజు (12) అనే విద్యార్ధి పాముకాటుకు గురై మృతి చెందినట్లు ఆయన చెప్పారు. గ్రామానికి చెందిన తెలుగు ఖాసీమన్న, తల్లి పద్మల కుమారుడు నాగరాజు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి భోజనం తర్వాత ఆరుబయట పడుకున్నాడు. ఈ సమయంలో పాముకాటు వేయగా ఇది గమనించని బాలుడు ఏదో కరించిందని తండ్రికి చెప్పాడు. వెంటనే గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా విద్యార్థి మృతి చెందాడు. సోమవారం ఉదయం గద్వాల దవాఖానలో విద్యార్థికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సైని వివరణ కోరగా పాముకాటుకు విద్యార్థి మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాడు. నాగరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...