గోవాపైనుంచి పడి వ్యక్తి మృతి


Tue,August 13, 2019 01:41 AM

-టీఆర్‌ఎస్ నాయకుల పరామర్శ
పాన్‌గల్ : మండలంలోని ఆకులోనిపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త లక్ష్మయ్య(49) మేస్త్రీ పని చేస్తుండగా ఇండ్లకు కట్టెలు కట్టుకునే గోవాపైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకొని మాజీ జెడ్పీటీసీ రవి, తెరాస మండల యూత్ ప్రెసిడెంట్ గోపాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట తెరాస నాయకులు రోశన్న, నాగరాజు, బాలరాజు తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...