విద్యుత్‌షాక్‌తో కాడెద్దు మృతి


Tue,August 13, 2019 01:41 AM

పెద్దమందడి : మండలంలోని పామిరెడ్డిపల్లి రైతు చిన్నరాములుకు చెందిన కాడెద్దు సోమవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. దొడగుంటపల్లి గ్రామనికి చెందిన గోవింద్‌రెడ్డి పొలం దగ్గర విద్యుత్ శాఖాధికారులు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేయకపోవడంతో గతంలో మేతకు వెళ్లిన పశువులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సోమవారం కూడా కాడెద్దు మృతిచెందడంతో పాడి పశువుల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా మరో రెండు పశువులు కూడా ఇక్కడే చనిపోయాయని మాజీ ఎంపీపీ మన్నెపురెడ్డి తెలిపారు. చిన్నరాములు కాడెద్దు మృతిచెందడంతో దాదాపు రూ.50వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...