విద్యుదాఘాతంతో రైతు మృతి


Tue,August 13, 2019 01:40 AM

మద్దూరు : విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ యాదయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మరికంటి ప్రభుదాస్(34) తన వ్యవసాయ పొలంలో వరినాట్ల కోసం కరిగెట చేసేందుకు వెళ్లాడు. పొలంలో ఉన్న బోరు మోటారును ఆన్ చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన చుట్టుప్రక్కల వారు మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ విషయమై మృతుని భార్య అరుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని నారాయణపేట జిల్లా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందచేసినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అందరితో కలిసిమెలసి ఉండే ప్రభుదాస్ విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందడంతో గ్రామం లో విశాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా అధికా రులు భద్రత చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...