మహిళలకు ఉచితంగా మగ్గం శిక్షణ


Tue,August 13, 2019 01:40 AM

-ప్రారంభించిన చైల్డ్ కేర్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి
వనపర్తి క్రీడలు : బైరాడ్ ఆర్థిక సహాకారంతో చైల్డ్ కేర స్వచ్ఛంద సంస్థ నిర్వహణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాసవి భవనం, వల్లభ్‌నగర్‌లో ఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని ఆ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మగ్గం శిక్షణ 37 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. శిక్షణలో భాగంగా మహిళాలకు మధ్యాహ్నా భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బైరాడు అసిస్టెంట్ డైరెక్టర్ రవీంద్ర, వరప్రసాద్, గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ రవీందర్ నాయక్, బాలరాజు, వెంకటేశ్, మంజుల, శ్రీధర్, భారతి, విజయలక్ష్మి, సంస్థ నిర్వాహకులు సంధ్యారాణి, శ్రీనివాసులు, ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...