ఈద్ ముబారక్


Tue,August 13, 2019 01:39 AM

వనపర్తి సాంస్కృతికం : భక్తికి, త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా సోమవారం ముస్లింలు నూతన వస్ర్తాలు ధరించి సమీపం లో ఉన్న ఈద్గాల వద్ద ముస్లింలు భారి ర్యాలీగా వెళ్లి ప్రత్యే క ప్రార్థనలు చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొ ని ముస్లిం మత పెద్దలు పండుగ విశిష్టతను వివరించారు. ప్రార్థనాల అనంతరం ముస్లింలు ఒకరినొకరు అలాయి బలాయి చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రార్థన స్థలానికి మంత్రి నిరంజన్‌రెడ్డి చేరుకొని ముస్లిం సోదరులను అలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కల్పుకొని సంక్షేమ పథకాలతో ప్రజలను అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తుతుందన్నారు.

కుల మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణలో పండుగలు నిర్వహించడం వనపర్తిలో మొదటి నుంచి వస్తున్న ఆచారమని అయన గుర్తు చేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, ముస్లింలు అలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ లోకనాథరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్‌గౌడ్, ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షుడు అభిలాశ్, కౌన్సిలర్లు గట్టుయాదవ్, తిరుమల్, కృష్ణ, వాకిటి శ్రీధర్, లక్ష్మీనారాయణ, శ్యాం, సతీశ్ సాగర్, పాకనాటి కృష్ణ, గిరి, డీజే శ్రీనివాసులు, ఆయా పార్టీ నాయకులు కృష్ణ, రాములు, నారాయణ, కుమార్, శ్రీనివాస్ గౌడ్, శంకర్, కిరణ్‌కుమార్, రాగివేణు, జహంగీర్, అంజాత్, గులాం ఉషన్, పట్టణ సీఐ సూర్యనాయక్, ఎస్సైలు రాఘవేందర్‌రెడ్డి, నరేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తకోటలో..
మదనాపురం (కొత్తకోట) : కొత్తకోట మండల కేంద్రం తో పాటు ఆయా గ్రామాలలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఈద్గా, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్తకోట పట్టణంలోని ఈద్గా వద్దకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నియోజక వర్గ సభ్యత్వ కమిటీల ఇన్‌చార్జి వాల్యానాయక్ ముస్లింలను అలింగనం చేసుకుంటు పం డుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలు శాలువాలతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వాల్యానాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంత మౌనికలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వడ్డె శ్రీను, మాజీ జెడ్పీటీసీ పీజే బాబు, కోఆప్షన్ సభ్యుడు అల్లబాష, సీడీసీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు లతీఫ్, వసీంఖాన్, గని, మాజీ సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, బాలనారాయ ణ, కొండారెడ్డి, ప్రశాంత్, మిషేక్, బాబురెడ్డి, బాలకృష్ణ, శ్రీనూజీ, అద్వానిశ్రీను, శాంతిరాజ్, అయ్యన్న, రాములుయాదవ్, భాస్కర్, గంగాధర్, సత్యంయాదవ్, సుభాష్, వెంకట్ రెడ్డి, నిర్మాలాదేవి, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...