బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం


Tue,August 13, 2019 01:38 AM

-మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి వైద్యం : ఆదివారం మధ్యాహ్నాం వేగంగా వస్తున్న తుపాను ఎదురుగా మోటర్‌సైకిల్‌ను ఢీకొనడంతో కర్నెతండాకు చెందిన తండ్రి, కొడుకులు అక్కడిక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం ఉదయం పర్మియనాయక్, తరుణ్ మృతదేహాలను పోస్టుమార్లం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తీసుకురావడంతో ఆయన మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అన్నారు. అదేవిదంగా ప్రమాదానికి గల కారణాలను మండల టీఆర్‌ఎస్ నాయకులను, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా పర్మియనాయక్ పెద్ద కుమారుడు వినోద్ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నాడు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని, కుటుంబం నిరాశకు గురికావద్దని అన్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, గొర్రె కాపారుల సంఘం జిల్లా డైరెక్టర్ కురుమూర్తి యాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, కౌన్సిలర్ తిరుమల్, రాజు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...