తుంగభద్ర పరవళ్లు


Mon,August 12, 2019 12:51 AM

అయిజ : తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. కర్నాటకలోని ఎగువన కురుస్తున్న వానలకు టీబీ డ్యామ్ పూర్తిగా నిండి వరదనీరు దిగువకు ప్రవహిస్తోంది. టీబీ డ్యామ్ నుంచి 2,30,066 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తుండగా, కర్నాటకలోని ఆర్డీఎస్‌కు చేరుతోంది. అక్కడినుంచి దిగువన ఉన్న సుంకేసులకు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

33 గేట్ల ద్వారా దిగువకు పరుగులుకర్నాటకలోని టీబీ డ్యాం 33 గేట్లు తెరుచుకుని తుంగభద్ర దిగువకు ప్రవహిస్తోంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో మొత్తం 33 గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.

టీబీ డ్యాం ఎగువ భాగంలోని అగుంబే, శృంగేరి, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, చిక్ మంగళూరు తదితర ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఆదివారం టీబీ డ్యామ్‌కు వరద భారీగా పెరగడంతో గేట్లన్నీ ఎత్తి నీటిని నదికి వదులుతున్నారు. నది ప్రవాహం మంత్రాలయం వద్ద 2.15 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. తుంగభద్ర నదిలో రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. టీబీ డ్యాంకు ప్రస్తుతం 2,16,096 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో చేరుతుండగా, 2,30,066 క్యూసెక్కులను 33 గేట్ల స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 88.661 టీఎంసీలను నిల్వ ఉంచుకుని వరద నీటిని విడుదల చేస్తున్నారు. 1633 అడుగుల నీటి మట్టానికి గాను 1629.70 అడుగుల నీటి మట్టం ఉందని టీబీ బోర్డు అధికారులు తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...