ఆర్డీఎస్ ఆనకట్టపై ప్రవాహం


Mon,August 12, 2019 12:50 AM

టీబీ డ్యాం నుంచి 2 లక్షలకు పైగా వరదనీరు దిగువకు విడుదల చేయడంతో కర్నాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టపై నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు 2 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు కర్నాటక ఈఈ రామయ్య తెలిపారు. దీంతో దిగువన ఉన్న మంత్రాలయం వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. మంత్రాలయం సమీపంలో మొదటి ప్రమాద హెచ్చరికను దాటి వరద నీరు ప్రవహిస్తుందని కర్నూల్ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి సోమవారం వరద ఉధృతి కొనసాగుతుంది.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...