అలుగు పారిన కడుకుంట్ల గ్రామ చెరువు


Mon,August 12, 2019 12:50 AM

వనపర్తి రూరల్ : మండలంలోని కడుకుంట్ల గ్రామానికి చెందిన చింతల చెరువు ఆదివారం అలుగు పారడంతో తూము వద్ద సర్పంచ్ హరిత జలాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీమా ఫేజ్ ప్యాకేజి 27 ద్వారా నీటిని విడుదల చేసి గ్రామ చెరువుకు నీళ్లను అందించడం చాలా సంతోషదాయకమన్నారు. దీంతో చెరువు నిండి అలుగు పారడంతో గ్రామంలో రైతులకు పంట సాగుకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...