బిక్కు బిక్కు మంటున్న నది అంచు పల్లెలు


Mon,August 12, 2019 12:50 AM

చిన్నంబావి : మహారాష్ట్ర, కర్ణటక రాష్ర్టాలలో ఎడతెరుపులేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుండడం తో 2009 సంవత్సరంలో వచ్చిన వరదలను గుర్తుచేసుకొని చిన్నంబావి మండలంలోని గడ్డబస్వాపూర్, అయ్యవారిపల్లి గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గత పది సంవత్సరాల కిందట వచ్చిన వరదలకు ఈ రెం డుగ్రామాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయి సర్వం కొల్పోయి ఆ చేదు జ్ఞాపకాలను మరవక ముందే మళ్లి ఉధృతంగా ప్రవహిస్తు ప్రమాదసూచికలు దాటుతూ పల్లెవైపు వస్తున్న కృష్ణమ్మను చూసి ఎప్పుడు ఏ గ్రా మాన్ని ముంచేస్తుందోనని ముంపు గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. సమైఖ్యరాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల జరిగిన నష్టం మరలా స్వరాష్ట్రంలో జరగకుండ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టి అధికారులు ఎప్పటికప్పుడు ముంపు గ్రామల ప్రజలకు ముందస్తు చర్యలు చేపట్టడంతో నదితీర గ్రామస్తులు కస్తా ధైర్యంతో ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...