ముస్తాబైన ఈద్గాలు, మసీద్‌లు


Mon,August 12, 2019 12:49 AM

వనపర్తి సాంస్కృతికం : మనిషిలో త్యాగ భావాన్ని సజీవంగా సచేతంగా ఉంచి సోదర భావాన్ని పెంపొందించే బక్రీద్ ఈద్ ఉల్ జుహా పండుగను సోమవారం ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సన్నద్ధమైనట్లు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ జహంగీర్ తెలిపారు. ఈ పండుగలో నమాజ్ నిర్వహించేందుకు జిల్లా వ్యాప్త ంగా పండుగ సామూహిక పార్థనలను నిర్వహించే ఈద్గా మైదానాల్లో నిర్వాహక కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాతో పాటు మండలా లు, గ్రామాల్లో ఉన్న మసీదులను, ఈద్గాలకు ప్రత్యేకంగా ముస్తాబు చేశా రు. జిల్లా కేంద్రంలో పాతబజార్ మహ్మాదీయ మసీద్, బవన్నగడ్డ మదీన మసీ ద్, న్యూబస్టాండ్ సమీపంలోని మక్కా మసీద్, గాంధీచౌక్ సమీపంలోని జానైజంపర్‌మథర్ మసీదులను ముస్తాబు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని గోపాల్‌పేట రోడ్డు పక్కన ఉన్న ఈద్గా ప్రాంతంలో గడ్డి తీసివేసి పరిశుభ్రంగా చేశారు. ఈ పండగకు ముఖ్యఅతిథులుగా ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు హాజరవతారని జిల్లా ముస్లిం మత పెద్దలు తెలిపారు.

నేడు ఈద్గా వద్దకు రానున్న మంత్రి
వనపర్తి, నమస్తే తెలంగాణ : ముస్లిం పండుగైన బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గల ఈద్గా వద్దకు సోమవా రం ఉదయం 9 గంటలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరవుతున్నట్లు టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు గట్టుయాదవ్, యువజన కమిటీ అధ్యక్షుడు సూర్యవంశం గిరి ఆదివారం వేర్వేరుగా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా, పట్టణ, నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్ని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపే కార్యక్రమంలో పాల్గొన్నాలని వారు కోరారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...