గోవుల తరలింపును అడ్డుకున్న బీజేపీ నాయకులు


Mon,August 12, 2019 12:49 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : అమరచింత శివారులో గోవులను అక్రమంగా వాహనంలో తరలించడాన్ని బీజేపీ, విశ్వహిందు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బక్రిద్ పండుగ నేపథ్యంలో వాటిని తరలిస్తున్నారంటూ పోలీసులకు సమాచారమిచ్చి తరలింపును అడ్డుకున్నారు. 13 పశువులు ఉండగా అందులో మూడు గోవులను పక్కదారి పట్టించి తప్పించారని వారు ఆరోపించారు.

పెద్ద ఎత్తున గోవులను తరలిస్తున్నారనే సమచారంతో అమరచింతలో కలకలం రేగింది. వామపక్ష పార్టీల నాయకులు సైతం అక్కడికి చేరుకొని వ్యవసాయదారులు వ్యాపారరిత్యా తరలిస్తున్న నేపథ్యంలో అడ్డుకోవడమేంటని వారించారు. వధాశాలకు తరలిస్తున్నట్లు ఆందోళన చేయడాన్ని వారు తప్పుపట్టారు. మొత్తంగా పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి ఓ గోవును మల్లాపురంలోని గోశాలకు తరలించారు. మిగిలిన పశువులను అమరచింత ఠాణాకు తరలించారు. విచారణ నిర్వహించి వాటిని ఎక్కడికి పంపించాలో నిర్ణయిస్తామని సీఐ శంకర్ తెలిపారు. దీంతో ఇరువర్గాలు ఆందోళనను విరమించాయి.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...