కృష్ణమ్మ ఉగ్రరూపం


Sun,August 11, 2019 12:09 AM

-10 గేట్లు ఎత్తి సాగర్ వైపునకు పరవళ్లు
-శ్రీశైలం నుంచి 4.61 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో విద్యుదుత్పత్తి ద్వారా 72,056
-కనువిందు చేస్తున్న డ్యాం అందాలు
-10 గేట్లు ఎత్తి సాగర్ వైపునకు పరవళ్లు
-శ్రీశైలం నుంచి 4.61 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో
విద్యుదుత్పత్తి ద్వారా 72,056
-కనువిందు చేస్తున్న డ్యాం అందాలు

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి నమస్తే తెలంగాణ/ శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు కనువిందు చేస్తోంది. నల్లమల అడవుల మధ్య పెద్ద కొండలకు నడుమ గోడ కట్టినట్లుగా ఉండే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద శనివారం సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు నుంచి 10 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ సవ్వడి చేస్తూ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతున్నది. శుక్రవారం సాయంత్రం తెలంగాణ, ఏపీ మంత్రులు శ్రీశైలం నుంచి సాగర్‌కు 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా.. శనివారం ఉదయానికి ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టు 883 అడుగులకు చేరుకుంది.

ఇన్ ఫ్లో 6,03,521 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4,61,560గా నమోదైంది. ఆల్మట్టి, నారాయణపుర, జూరాల నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో అదే స్థాయిలో అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం నుంచి తుంగభద్ర డ్యాం గేట్లను తెరిసిన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు మరింతగా వరద వచ్చే అవకాశం ఉంది. 5 గేట్లను 10 మీటర్ల చొప్పున, మరో 5 గేట్లను 15 మీటర్ల చొప్పున ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న వరదతో 312.05 టీఎంసీల సామర్థ్యం గల సాగర్ శనివారం నాటికి 150 టీఎంసీలకు చేరుకుంది.

సోమవారం నాటికి 7లక్షల క్యూసెక్కుల వరద
ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శ్రీశైలానికి మరింతగా ఇన్‌ఫ్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. భీమా వరద సుమారు లక్ష క్యూసెక్కులు జూరాలకు అదనంగా వచ్చి చేరుతున్నాయి. తుంగభద్ర డ్యాం గేట్లు తెరవడంతో అక్కడి నుంచి సోమవారం అర్ధరాత్రి నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా, భీమా, తుంగభద్ర వరద ఏకకాలంలో కలిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో రెండు మూడు రోజుల్లో 7లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు సుమారు 7 లక్షల ఇన్‌ఫ్లో నమోదయ్యే అవకాశం ఉండటంతో ఈసారి సాగర్ సైతం నిండి గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...