రేషన్ బియ్యం అక్రమ నిల్వపై కేసు నమోదు


Sun,August 11, 2019 12:03 AM

ఖిల్లాఘణపురం : మండలంలోని సోలీపూర్ గ్రామంలో శుక్రవారం ఒ పాడుబడిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని డీఎస్‌వో రేవతి సిబ్బందితో కలిసి అట్టి బియ్యాన్ని సీజ్ చేసిన విషయం విదితమే. శనివారం విచారణ అనంతరం అట్టి బియ్యాన్ని గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డిలవేనని విచారణలో తేలిందని వీరిపై కేసు నమోదు చేయాలని ఎస్సై వెంకటయ్యకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డీఎస్‌వో రేవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...