అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన


Sun,August 11, 2019 12:03 AM

పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : శ్రీరంగాపురం మండల కేంద్రంలోని దళితవాడ ఒకటో నంబరు అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సర్పంచ్ వినీలారాణి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లీబిడ్డలు తీసుకొనే ఆహారంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పసిపిల్లలకు పోషక విలువలతో కూడి, త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలని కోరారు. పండ్లు, గుడ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు వంటివి విరివిగా పెట్టాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ కవిత, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...