పాఠశాల ఆవరణలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు


Sun,August 11, 2019 12:03 AM

గోపాల్‌పేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా మైదానం పాఠశాలకు చెందిందని పాఠశాల ఆవరణలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానానికి సంబంధించిన సర్వే నెంబరు (422) స్థలం కబ్జాకు గురికావడంతో ఈ విషయమై ఇటీవల హరితహారంలో పాల్గొనేందుకు పాఠశాలకు వచ్చిన కలెక్టర్ శ్వేతామొహంతికి ఉపాధ్యాయులు విన్నవించారు. దీనిపై ఆమె సర్వేచేయించి పాఠశాలకు సంబంధించిన స్థలం హద్దులు ఏర్పాటు చేయాలని తాసీల్దార్ రాధాకృష్ణను ఆదేశించారు.

సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది శనివారం ఇది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఆట స్థలం ఇందులో నిర్మాణాలు నిషేదం అంటూ పాఠశాల ఆవరణలో హెచ్చరిక బోర్డ్డు ఏర్పాటు చేశారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...