వ్యాయామంతోనే రోగాలు దూరం


Sun,August 11, 2019 12:03 AM

-l డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్
రేవల్లి : ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల రోగాల దారిచేరవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని తల్పునూర్ గ్రామంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన వివేకానంద చారిటబుల్‌ట్రస్ట్, మన ఊరు-మనబడి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యం లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎంపీపీ సేనాపతి, సర్పంచ్ నరేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు పనివత్తిడి వల్ల తమతమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తారని, ప్రతిరోజు మంచి పౌష్టిక ఆహారం తీసుకుని సరైన వ్యాయామం చేయడంతో వారు రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆయన అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు దశరథం, ప్రవీణ్‌కుమార్, మంజుల, గ్రామస్తులు ఉదయ్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు వేణుగోపాల్, మదవలక్ష్మి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...