తుంగభద్ర డ్యాం 28 గేట్లు ఎత్తివేత


Sun,August 11, 2019 12:02 AM

తుమ్మిళ్ల పంపులను సిద్ధంగా ఉంచండి
అయిజ : తుంగభద్ర నదికి వరద నీరు వస్తుండటంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సీఈ ఖగేందర్ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటి, రెండో పంపులను సీఈ పరిశీలించారు. వరద నీరు సుంకేసుల జ లాశయానికి చేరుకోగానే మొదటి పంపును ప్రారంభించి 350 క్యూసెక్కుల నీటిని ఆర్డీఎస్ కాల్వలోకి ఎత్తిపోయా లన్నారు.

సోమవారం డ్రైరన్ చేసి మోటార్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వరద నీరు భారీగా చేరుకున్న తర్వాత రెండో పంపును ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వరద నీరు వచ్చేలోగా రెండో పంపునకు విద్యుత్ కనెక్షన్ పూర్తి చేయాలన్నారు.

తుంగభద్ర నదికి వచ్చే నీటి ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందించేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. నీటి వృథా చేయకుండా ప్రతి నీటి చుక్కను వ్యవసాయానికి వినియో గించాలన్నారు. తుమ్మిళ్ల పంపుల పనితీరును ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఎస్ నీటితోపాటు తుమ్మిళ్ల పంపుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అం

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...