నీట మునిగిన వాసునగర్


Sun,August 11, 2019 12:01 AM

నమస్తే తెలంగాణ ప్రతినిధి, నారాయణపేట/కృష్ణ/మాగనూర్ : కృష్ణా నదికి క్షణం క్షణం ప్రవాహ తీవ్రత పెరుగు తుండడంతో పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలకు కునుకు లేకుం డా చేస్తుంది. శుక్రవారం ఉదయం నుం చి భీమా నది నుం చి మూడు లక్షల క్యూ సెక్కుల జలాలు కృష్ణా మండలంలోని తంగడి గ్రామం వద్ద కృష్ణా నది జలాలతో కలువడంతో నదీ ప్రవాహం క్షణ క్షణానికి పెరుగుతూ వస్తుంది. దీంతో కృష్ణ మండలంలో ఉన్న వాసునగర్ శనివారం ఉదయం నుంచి జలమధ్య చిక్కు కోవడం ఆరంభమైంది. పరిస్థితిని గమనించిన అధికా రులు గ్రామస్తులను గ్రా మం నుంచి ఖాళీ చేయించారు. వారికి సంబంధించిన పశువులకు జాతీయ రహదారి వెంబడి ఏర్పాట్లు చేసి వసతులను కల్పించారు. ఇదే మండలంలోని కృష్ణా నదికి రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న హిందూపూర్‌లో సమీపంలో ఉన్న పశు వైద్యశాలతో పాటు కొన్ని ఇండ్లు కూడా నీటితో నిండాయి.

క్షణం క్షణం ప్రమాద భరితంగా మా రుతున్న విషయాన్ని తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ నర్సింహాగౌడ్, పార్టీ నేతలతో కలిసి వాసునగర్, హిం దూపూ ర్, కృష్ణా రైల్వే బ్రిడ్జి తదితర ప్రాం తాలను పరిశీలించారు. ఉదయం నుంచి కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలతో ఆర్డీవో శ్రీనివా సులు కృష్ణా పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలను పరిశీలించి ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచనలు చేశారు. రాత్రి సమయంలోను జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఇతర అధికారులు నదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలలోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం సాయంత్రం హిందూపూర్ గ్రామ సమీపంలో 5 నీటి కుక్కలు నీళ్లల్లో మునుగు తూ తేలుగతూ ఉన్న దృష్యాలు కనిపించాయి. ఈ దృష్యాలను గ్రామస్థులు ఆసక్తిగా గమనించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...