ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యం


Sat,August 10, 2019 12:48 AM

అమ్రాబాద్ రూరల్ : నల్లమల్ల పరిధిలో ఉండే ఆదివాసీలను అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. నల్లమలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలోని పీటీజీ గురుకుల పాఠశాల ఆవరణలో పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించింది. ఈ వేడుకలను ఐటీడీఏ పీవో అధ్యక్షతన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆట, పాట, మాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అథితిగా ఎంపీ పోతుగంటి రాములు హాజరై ఆదివసీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలోని వంద దేశాల్లో 50 కోట్ల ఆదివాసీ బిడ్డలు ఉండగా అందులో 490 తెగలున్నాయని, మన రాష్ట్రంలో చాలా అరుదైన ఆదివాసీ తెగ చెంచులు నల్లమల ప్రాంతంలో ఉన్నారని ఎంపీ గుర్తు చేశారు. ఆదివాసీ గిరిజనులకు ఆర్వోఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టిందన్నారు. ఒక ఆదివాసీ గిరిజన బిడ్డ డాక్టర్ వృత్తి అయినప్పటికీ, ఆ బిడ్డనే ఐటీడీఏకు పీవోగా ఉండటం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆదివాసీలకు నిత్యావసర సరుకుల పంపిణీలో సమస్యలను అధిగమించుటకు తగిన ప్రణాళిక ఏర్పాటు చేసి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అన్ని చెంచు పెంటల్లో నిత్యావసర సరుకుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తామన్నారు. అంతకు ముందు ఆదివాసీ ప్రజాప్రతినిధులు, పెద్దలు ఎంపీ రాములును పూలమాల శాలువతో సన్మానించారు.

సంస్కృతి, సంప్రదాయాలతో సంబురాలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా చెంచులకు వారి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు, మహిళలు, పురుషులకు వేరు వేరుగా క్రీడలను నిర్వహించారు. పీవో, డీటీడీవో, చెంచు పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, గిరిజనుల సమక్షంలో ఆదివాసీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీటీడీవో అఖిలేశ్ రెడ్డి, అచ్చంపేట నగర పంచాయితీ చైర్మన్ తులసీరాం, పదర జెడ్పీటీసీ రాంబాబు నాయక్, ప్రిన్సిపాల్ సైదులు, మొగిలయ్య, చెంచు సర్పంచులు పద్మ, పెద్దిరాజు, ఎంపీటీసీ శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ శ్రీరాం నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనువాసులు, మల్లిఖార్జున్, బాల గురువయ్య, వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మంది ఆదివాసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...