ఇద్దరు యువకులు అదృశ్యం


Sat,August 10, 2019 12:47 AM

పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 7న సాయంత్రం బాలకిష్టమ్మ కుమారుడు పీ లక్ష్మణ్ (25), లక్ష్మన్న కుమారుడు జీ స్వామి (25)అనే యువకులు ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వారి కు టుంబ సభ్యులు వారికి ఫోన్‌లు చేయగా మేము మరో వ్యక్తితో కలిసి జూరాల డ్యాంకు వెళ్లినట్లు, రాత్రి 12 గంటలకు వస్తామని చెప్పినట్లు యువకుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. తిరిగి ఫోన్‌లు చేయగా అవి స్విచ్‌ఆఫ్ అయి ఉన్నాయని, కర్నాటక భాషలో సమాధానం వస్తొందని వారన్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...