సోలీపూర్‌లో రేషన్ బియ్యం పట్టివేత


Sat,August 10, 2019 12:47 AM

ఖిల్లాఘణపురం : మండలంలోని సోలీపూర్ గ్రామంలో ఓ పాడు ఇం ట్లో గుర్తు తెలియని వ్యక్తులు 36 సం చుల రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచా రు. ఈ విషయంపై కొంతమంది గ్రామస్తులు పౌరసరఫరా అధికారి రేవతికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆమె శుక్రవారం ఎస్సై వెంకటయ్యతో కలిసి గ్రామానికి చేరుకొని బియ్యం నిల్వ ఉన్న పాడుపడిన ఇంట్లోకి వెళ్లి చూడగా 36 సంచుల రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఉన్న కొంత మంది గ్రామస్తులు ఈ బియ్యం గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డివని చెప్పడంతో అక్కడ నుంచి ఆమె శేఖర్‌రెడ్డి చెం దిన సిద్దు రైసుమిల్లు వద్దకి వెళ్లి అక్క డ నిల్వ ఉన్న బియ్యాన్ని తనిఖీ చేశారు.

అక్కడికి వచ్చిన శేఖర్‌రెడ్డి అనుచరులు అధికారులపై వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి కేసు నమోదు చేయ్యకుండానే అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. పట్టపగలు ఆక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నప్పటికీ ఆ విషయం అధికారులకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. తనిఖీలో ఆమెతో పాటు సిబ్బంది రాములు తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...