వరలక్ష్మీ నమోస్తుతే


Sat,August 10, 2019 12:47 AM

వనపర్తి సాంస్కృతికం/రూరల్/పెద్దమందడి/పెబ్బేరు : శ్రావణమాసం రెండో శుక్రవారం పురష్కరించుకుని వనపర్తి, పెద్దమందడి, పెబ్బేరు మండలలోని పలు ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక కన్యాకాపరమేశ్వరి, వేంకటేశ్వర, రామాలయం, లక్ష్మీగణపతి దేవాలయంలో అమ్మవారిని భక్తులు సమర్పించిన నూతన వస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక శ్రీచక్రం కుంకుమ అర్చనలు చేశారు. రెండు విడుతలుగా వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు.

వేంకటేశ్వర దేవాలయంలో పవిత్రోత్సవంలో భాగంగా రెండో రోజు యాగశాల యందు నిత్యహోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలను భక్తులు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి వచ్చిన యాజ్ఞా చార్య స్వామి, శ్రీ సుధన్వాచార్యులు వ్రతంలోని విశిష్టత, భారతీయ సాంస్కృతికి సంబంధించిన సంప్రదాయ విషయాలను భక్తులకు తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా వేంకటేశ్వర దేవాలయ ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వనపర్తి మండలంలోని రాజనగరం గ్రామ శివారులోగల విశ్వక్సేన్ గోశాలలో శుక్రవారం గోవును ప్రత్యేక్ష లక్ష్మిగా పూజలు నిర్వహించినట్లు రామాచార్యులు తెలిపారు. అలాగే పెబ్బేరు మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళా అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కార్యక్రమంలో వికాస తరంగిని శ్రీనివాస్, రామకృష్ణ రెడ్డి, ప్రవీణ్‌కుమార్, గురుప్రసాద్, రామచంద్రా ఆచార్యులు, రాఘవాచార్యులు, భరణి సాగర్ ఆచార్యులు, గంగాధర్, వీరయ్య పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...