ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలి


Sat,August 10, 2019 12:46 AM

వనపర్తి విద్యావిభాగం : జిల్లాలోని ఉపాధ్యాయులు అంకితభావంతో వృత్తిని నిర్వహించాలని, జిల్లావ్యాప్తంగా అమలవుతున్న ఏబీసీ ప్రొగ్రాంను అమలు చేయాలని డీఈవో సుశీందర్‌రావు అన్నారు. శుక్రవారం ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం నేతలు ఏబీసీ ప్రొగ్రాంపై ఆ సంఘం ఆధ్వర్యంలో డీఈవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు సకాలంలో పాఠశాలకు వెళ్లి నాణ్యవంతమైన బోధన అందించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఏబీసీ ప్రొగ్రాం అమలవుతుందని తాను కొన్ని పాఠశాలలను తనిఖీ చేయ్యగా ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా మార్కులు వేశారని, మరికొన్ని చోట్ల ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు చిన్న కూడికలు కూడా చేయలేకపోతున్నారని అన్నారు.

ఏబీసీ ప్రొగ్రాంపై కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు ఆర్పీల ద్వారా అవగాహన నిర్వహించామని తానే స్వయంగా అన్ని గ్రూపులలో సమాచారాన్ని వేసినప్పటికీ ఉపాధ్యాయులు అలసత్వం వీడడంలేదని ఆయన ఆవేదన, అసహానాన్ని వ్యక్తం చేశారు. ఏబీసీ అమలు పనితీరుపై జిల్లావ్యాప్తంగా 70 టీంలు, మొదటి దశ ప్రణాళికలో పాఠశాలలకు వెళ్లి పరిశీలించి పలు సూచనలు ఇస్తున్నారన్నారు. ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరుచుకొని కనీస సామర్థ్యాలు చదవడం, రాయడం, గణితంలోని చతుర్విద ప్రక్రియలు విద్యార్థులు సాధించేలా చూడాలని ఆయన సూచించారు. సందేహాల నివృత్తిని ఎప్పటికప్పుడు చేసుకుంటు 45 రోజుల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...