విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి


Sat,August 10, 2019 12:46 AM

వనపర్తి విద్యావిభాగం : క్రమశిక్షణ, పట్టుదలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విజ్ఞాన్ జూనియర్ కళాశాల యాజమాన్య సభ్యులు పాపయ్యనాయుడు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాయి ఫంక్షన్ హాల్‌లో విజ్ఞాన్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు స్వాగతోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే జిల్లా కేంద్రంలోని త్రివేణి జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం స్వాగతోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విజ్ఞాన్, త్రివేణి కళాశాలల ప్రిన్సిపాల్స్ రాజేశ్, కృష్ణగౌడ్, ఆయా కళాశాల యాజమాన్య సభ్యులు, అధ్యాపకులు హాజరయ్యారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...